చేరితి నిన్నే యేసునాధ - నీవే నా దైవం
cheeriti ninnee yeesunaadha - neevee naa daivam
చేరితి నిన్నే యేసునాధ - నీవే నా దైవం కోరితి నిన్నే ఆశతీరా - మనసే నీ సొంతం ఉన్నతమైన నీ ఘన నామం - జీవము నింపే ఆశాదీపం నీవే నా గానం - నాలో ఆనందం నీవే రాగం - నీవే ధ్యానం - నా ప్రాణం నీవేగా
ప్రేమకు రూపం - నీ అనురాగం - పాడి కీర్తింతును జీవితమంతా నీ ఘనకార్యం - నేను వివరింతును నా తోడుగా నీవుండగా - నీ ప్రేమతో దీవించగా సాగాలి ఈ స్నేహము - ఇదే నాకు ఆధారము చూపావు నీ మార్గము - సదా నీవే నా క్షేమము
నా శ్రమలోన వేదనలోన - నన్ను చూసావుగా నీ కృపలోన నా దరి చేరి - నీలో దాచావుగా నీ ఆత్మతో నింపావుగా - కనుపాపగా కాచావుగా ఏనాటి అనుబంధమో - ఇదే నాకు సౌభాగ్యము వేవేల స్తోత్రాలతో - సదా నీకే నా గీతము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
