TG-3465
Telugu

చేయి విడువకు నా చేయి విడువకు

cheeyi viduvaku naa cheeyi viduvaku

K Y Ratnamకిశోరె బాబు తప్పెట · Kishore Babu Thappetaఅన్వేష్షా · Anwesshaa
0
views
Chorus

చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు (2)

పల్లవి పూర్వ భాగం

నా ఆశ నీవే - నా ద్యాస  నీవే  ఆధారం - నీవే ఆరాధన నీకే (2) ||చేయి విడువకు||

1వ చరణం

నిదురే లేదు ఏ రాతిరిలో  గాయములన్ని నను తొలచుచుండగా నీదయ కొరకై ఆశతో నేను మెలకువ కలిగి ప్రార్ధించగా (2) గాఢాంధకారమంత అలుముకున్ననూ గమ్యము ఏమౌనో తెలియకున్ననూ (2) ||నా ఆశ నీవే||

2వ చరణం

క్షణమొక యుగమై కాలం గడువగా  కన్నీరే నాకు కాలక్షేపమాయెగా క్షేమము లేక స్వస్థత కొరకై  వేదనతో నేను కృంగి యుండగా (2) శ్రమలో తోడు లేక ఒంటరినైనా శిలనే కాక నేను మొరపెడుతున్న (2) ||నా ఆశ నీవే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.