TG-3207
Telugu

చిందింది రక్తం ఆ

Chindindi Raktham Aa

0
views
పల్లవి

చిందింది రక్తం ఆ సిలువ పైన కారింది రుధిరం కలువరిలోన (2) కరుణ చూప లేదే కసాయి మనుష్యులు కనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది||

1వ చరణం

ఏదేనులో పుట్టిన ఆ పాపము శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2) ఆ మరణమును తొలగించుటకు మరణ పాత్రను చేబూనావా (2) నా మరణమును తప్పించినావా ||కరుణ||

2వ చరణం

చేసింది లోకం ఘోరమైన పాపం మోపింది నేరం నీ భుజము పైనా (2) యెరుషలేములో పారిన నీ రక్తము ఈ లోక విమోచన క్రయధనము (2) ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ||

3వ చరణం

నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం మరణపు ముల్లును విరిచిన దేవుడా (2) జీవకిరీటము నిచ్చుటకై ముళ్ళ కిరీటము ధరించితివా (2) నాకు నిత్య జీవమిచ్చితివా ||కరుణ||