చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా
chirakaala sneehithudaa - naa hrudayaana sannihithudaa
🎵 TG-1056🌐 Telugu
పల్లవి
చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా (2) నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)
1వ చరణం
బంధువులు వెలివేసిన - వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం ||చిరకాల||
2వ చరణం
కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం ||చిరకాల||
3వ చరణం
నిజమైనది, విడువనిధి - ప్రేమించు నీ స్నేహం కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం ||చిరకాల||