TG-4933
Telugu

చిట్టి చిట్టి చీమ నీకేంత జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవ్వరమ్మా

Chitti Chitti Cheema Neekeentha Jnyaanamammaa Mundu Choopuloona Nee Saati Evvarammaa

12
views
పల్లవి

చిట్టి చిట్టి చీమ నీకేంత జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవ్వరమ్మా వేసవి కాలమంతా - కష్టపడతావు చాల కూర్చుకుంటావు ఆహారం - కొంచెం కొంచెం ఒబ్బిడిగా నిన్ను చూసి మేమంతా - నేర్చుకోవాలి చాలా సమయమునంతలోనే - సమకూర్చాలి రెండంతలుగా ||చిట్టి చిట్టి చీమ||

1వ చరణం

కొక్కొరొకో కోడి - నీ కూతకేది సాటి మేలుకొలపడంలో - నీతోనా మాకు పోటీ (2) ప్రొద్దు పొడవక ముందే - మేలుకుంటావు త్వరగా నిదురపోతున్న లోకాన్ని - లేచే వరకు వదలవుగా నిన్ను పోలి మేమంతా - మేలుకోవాలి త్వరగా తోటివారిని మేలుకొల్పే బాథ్యత మాదే ముఖ్యంగా ||చిట్టి చిట్టి చీమ||

2వ చరణం

నిత్య సత్య దేవా - ఓ క్రీస్తు యేసు ప్రభువా సృష్టిలో సకలము - నీ మహిమనే చాటవా (2) అతి చిన్న జీవిలో కూడా నీ జ్ఞానమే ఉట్టి పడదా అన్నిటా ఉన్న దేవా నిను ఎంతని ఏమని పొగడెను అంత గొప్ప దేవుడవు శక్తి జ్ఞానపూర్ణుడవు అతి అల్పులైన మాపై నీ ప్రేమకు నిత్యం స్తోత్రాలు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.