చూచితివే నా కన్నీటిని
Choochithive Naa Kanneetini
చూచితివే నా కన్నీటిని తుడచితివే నా యేసయ్యా (2) లొంగిపోయిన నా జీవితం కృంగిపోయిన నా ఆత్మను (2) చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే||
లోకమంతయూ నన్ను ద్వేషించినా సొంత బంధువులంతా నన్ను వెలివేసినా (2) చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే||
ఒంటరితనం నన్ను వేధించినా దీన దరిద్రురాలై నన్ను అవమానించినా (2) చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే||
ప్రేమతో నన్ను పిలిచావయ్యా నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా (2) మరువలేనయ్యా నీ ప్రేమ నేను… మరువలేనయ్యా నీ ప్రేమ (3) Thudachithive Naa Yesayyaa (2) Longipoyina Naa Jeevitham Krungipoyina Naa Aathmanu (2) Cheradeesene Nee Prema Nannu… Cheradeesene Nee Prema ||Choochithive||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.