TG-4973
Telugu

చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె

Choodumadee Choodumadee Nee Varudu Vachchuchunde

12
views
పల్లవి

1.  ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె ఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండె పల్లవి: చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె 2.  లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించె కల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను 3.  ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండె ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా 4.  జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడు తరుణమునందు శుద్ధి పొందినచో కరుణను గాంచలేవు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.