TG-4974
Telugu

చూడుమదే నీ కొరకే సిలువపై

Choodumadee Nee Korakee Siluvapai

0
views
పల్లవి

చూడుమదే నీ కొరకే సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్ 1.  నలుగ గొట్టబడి నీకై - పలుకకుండె మారుగా శిరస్సున రక్తధారలు విరిచె రెక్కలను గ్రుచ్చ నీ పాపమే, పాదములను - చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె 2.  రక్తసిక్తమై మోము - ఎఱ్ఱనయ్యె కొయ్యపై చూడు వీపున దున్నెను - దీనునిగా జేసె నీ పాపమే ప్రభు రక్తము ఏరులై - పారెను, నీ కొరకే సిలువపై 3.  గాయమైన చేతులన్ - దినమెల్ల చాపెనో పాపీ చూచుచుండె ప్రేమతో - నీకై కన్నెటిని కార్చుచు తన కృపతో, సంధించును - పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే 4.  ఎంతకాల మేడ్పించి - వెలుపలనుంతు వతనిని తెరువు హృదయ ద్వారమున్ - పొందు మారుమనస్సును ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును - నీకిచ్చు సురక్షణను