చూడుము సోదరుడా నీవు నేడే లేచి
Choodumu Soodarudaa Neevu Needee Leechi
చూడుము సోదరుడా నీవు - నేడే లేచి రక్షణ కొరకై వేడుము స్నేహితుడా 1. లెమ్ము నీకు వెలుగువచ్చెను - కమ్ముచున్నది చీకటి లోకమున్ చిమ్మచీకటి జనముల గమ్మెను - నెమ్మది నొందగ లేచి రా నమ్ముము సోదరుడా 2. దేవుని వాక్యము వెలుగైయున్నది - ఆ వెలుగే నీకు జీవమైయున్నది నీ వెనుకే ఆ జీవము నిలచెను - జీవము నొందగ వేగమే రా రావో సోదరుడా 3. నిలువుము నీ జీవము ఆవిరియే - ఇలలో లేదిక నీదని చెప్పెడు కలుషము లెల్లను కడుగును క్రీస్తు నిలుచును ఇల నీ కాపరియై కలువరి చెంతకు రా 4. మొర్రపెట్టుము నేడే లేచి - సరిచేసికొని జీవితమంత పరిశుద్ధ రక్తధారలతో - పరిశుద్ధుడు నిలచెను నీకై పరుగిడిరా ప్రియుడా 5. యేసుని నమ్మెడి వారిలలోన - యేసుని జీవము పొందిన వారై భాసురంబుగా మోక్షము జేర - నిల్చెదరు శక్తిని బొంది యేసే ఒసగును రా 6. హల్లెలూయ పాడుము నేడే - వల్లభుండేసు వచ్చునని ఎల్ల ప్రజలు చూచెద రేసున్ - చల్లని ప్రభూరాకన్ ఇలలో స్తుతులను పాడను రా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.