TG-3229
Telugu

క్రిస్మస్ ఆనందం వచ్చెను

Christmas Aanandam Vachchenu

0
views
పల్లవి

క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2) ఆనందము మహదానందము సంతోషము బహు సంతోషము (2) మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్||

1వ చరణం

శోధనలేమైనా – బాధలు ఎన్నైనా రండి క్రీస్తు నొద్దకు… రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము||

2వ చరణం

చింతయే నీకున్నా – శాంతియే కరువైనా రండి క్రీస్తు నొద్దకు… నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము||