TG-1293
Telugu

చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు

chuuchuchunna deevudavayyaa nannu chuuchinaavu

186
views
పల్లవి

చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా

1వ చరణం

శారాయి మాటలే విన్నాను అబ్రాముకే భార్యనయ్యాను ఈ అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును ||చూచుచున్న||

2వ చరణం

ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడితిని కన్నకొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని నేను ||చూచుచున్న||

3వ చరణం

పసివాడి మొరను ఆలకించావు జీవజలములనిచ్చి బ్రతికించావు నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు నీవు గొప్ప దేవుడవు ||చూచుచున్న||