చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు
chuudaree maarreemdu putti naamdu
పల్లవి
చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో నేఁడీ భూమి వాసులకు నిండు రక్షణబ్బెను ||చూడరే మాఱేఁడు||
1వ చరణం
ఎన్నరాని దేవ దీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను పన్నుగా రేయెండ కాంతి కన్ననది మించెను ||చూడరే మాఱేఁడు||
2వ చరణం
దూత తెల్పె వ్రేల కొక ప్రీతియగు ముచ్చటన్ ఖ్యాతిగ దావీదు పురిని కర్తయేసు పుట్టుటన్ ||చూడరే మాఱేఁడు||
3వ చరణం
తూరుపున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి వారు వీరు వచ్చి సేవ వరుసగాను జేసిరి ||చూడరే మాఱేఁడు||
4వ చరణం
మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవఁ జేతుము మిక్కుటముగ మనకు శాంతిఁ గ్రక్కున నొసంగును ||చూడరే మాఱేఁడు||