TG-651
Telugu

చూడుము గెత్సెమనే తోటలో నా

chuudumu gethsemanee thootaloo naa

207
views
పల్లవి

చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపి నాకై వి జ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది

1వ చరణం

దేహమంతయు నలగి శోకము చెందినవాడై దేవాది దేవుని ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే ||చూడుము గెత్సెమనే||

2వ చరణం

తండ్రి ఈ పాత్ర తొలగున్ నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను ||చూడుము గెత్సెమనే||

3వ చరణం

రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది రక్షకుడేసు హృదయము పగులుగ విజ్ఞాపనము చేసెనే ||చూడుము గెత్సెమనే||

4వ చరణం

ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే ||చూడుము గెత్సెమనే||

5వ చరణం

ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభువు వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెను ||చూడుము గెత్సెమనే||

6వ చరణం

నన్ను తనవలె మార్చెడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగగ సదా కీర్తించెదను ||చూడుము గెత్సెమనే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.