దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి
daahamu gonnavaaralaaraa daahamu theerchukonandi
🎵 TG-1071🌐 Telugu
పల్లవి
దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి దేవుడేసే జీవజలము - త్రాగ రారండి హల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి
1వ చరణం
జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్ జలము పొంది - జీవము నొంద జలనిధి చేరండి ||దేవుడేసే||
2వ చరణం
నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరు అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి ||దేవుడేసే||
3వ చరణం
తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడు తప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి ||దేవుడేసే||