TG-309
Telugu

దారుణ మగు మరణ వారిధి

daarunna magu maranna vaaridhi

197
views
పల్లవి

దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోర మగు కెరటములవలె వి స్తారముగ నేరములు పైఁగొని పారు చుండునప్పు డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ మగు||

1వ చరణం

ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద మని తలంచినఁ జెక్క నిర్మతమైన యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ మగు||

2వ చరణం

మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట పొంగి పారుచు మరణ నది త రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ మగు||

3వ చరణం

వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన క్రీస్తు యేసు నాధుఁడే నావి కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి ||దారుణ మగు||

4వ చరణం

మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె ||దారుణ మగు||

5వ చరణం

విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ మగు||

6వ చరణం

పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ మగు||

7వ చరణం

కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ మగు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.