దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు

daasula praarthana dappaka yesamgedu

🎵 TG-373💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట ||దాసుల ప్రార్థన||

1వ చరణం

జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస మిడునఁట ||దాసుల ప్రార్థన||

2వ చరణం

మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్ హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల కోర్కె లిచ్చునట ||దాసుల ప్రార్థన||

3వ చరణం

ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్ వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత రక్షణు(డట ||దాసుల ప్రార్థన||

Report Error