TG-3241
Telugu

దావీదు వంశంలో

Daaveedu Vamshamlo

21
views
పల్లవి

దావీదు వంశంలో – బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెను యేసయ్య కథ వింటే రక్షణ కలుగును – మార్గము సత్యం జీవము (2) ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితం పరిశుద్ధ దేవుని దివ్య రచితం నమ్మిన వారికి కలుగును జీవము పరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి హల్లెలూయ హల్లెలూయ దూతల గానాలు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు అరె హల్లెలూయ హల్లెలూయ క్రీస్తు జన్మము మార్చింది చరితను – క్రీస్తు శకముగ ప్రారంభము చీకటి రాజ్యముకు అంతము కలిగెను – దైవ రాజ్యము ఆరంభము (2) పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చును మరణచ్చాయలు అంతమగును అంతమే లేని జీవము నీకిచ్చును ఆది అంతము ఆ ప్రభువు ||గొల్లలు||

1వ చరణం

జీవాహారమును జీవజలమును నేనే – మంచి కాపరిని నేనన్నాడు భారమంతయు నాపైన మోపితే – నిత్యం భరియిస్తా నేనన్నాడు (2) దిగులుచెందకు ఆనందించు నాలో నీ స్నేహితుడ నేనన్నాడు మరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తే దేవుని రాజ్యంలో చోటన్నాడు ||గొల్లలు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.