♪♫
TG-066
Telugu
దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని
daiva preema pruthvilooni yannitini
201
views
పల్లవి
దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును యేసు మాలో నివసించు యది మా విముక్తియే నీ కమూల్య ప్రేమ యుండు నీవు దాసుల మైన మమ్ముఁ గృపతో రక్షించుము.
1వ చరణం
మమ్ము సంరక్షించు శక్తి నీకుండు, మా ప్రభువా ఎన్నఁ డెనఁ డేని నీదు సన్నిధిని బాయుము నిన్ స్తుతించుచుండి మేము సర్వదా సేవింతుము. నిన్ బ్రార్థించి పూర్ణప్రేమ మే మతిశయింతుము ||దైవ ప్రేమ||
2వ చరణం
క్రొత్తగా మమ్ము సృజించి పాప మెల్లఁ బాపుము మాకు స్వస్థత నొసంగి గొప్ప రక్షఁ జూపుము భక్తి యభివృద్ది పొంది స్వర్గమందుఁ జేరగా వింత నొంది ప్రేమ స్తుతి నీకర్పింతు మెప్పుడు. ||దైవ ప్రేమ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.