TG-1294
Telugu

దైవజనులు కావాలి కావాలి

daivajanulu kaavaali kaavaali

207
views
పల్లవి

దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభుసేవకు పరుగులెత్తువారు ప్రభుకోసం ప్రాణమిచ్చెడివారు

1వ చరణం

నశించు పోవు దేశము కొరకు కన్నీరు కార్చెడి వారు పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు ||దైవజనులు కావాలి||

2వ చరణం

ప్రభు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి కావాలి ఎలిషా వంటి వారు కావాలి లేవాలి ||దైవజనులు కావాలి||

3వ చరణం

కోతెంతో విస్తారము కోసెడి పని వారు కొదువగా పొలములో పనిచేయుటకు వస్తావా నీవు వస్తావా నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది ||దైవజనులు కావాలి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.