దైవకుమారుడు లోకానికి వచ్చాడు అతిసుందరుడు మనకొరకె పుట్టాడు
Daivakumaarudu Lookaaniki Vachchaadu Athisundarudu Manakorake Puttaadu
దైవకుమారుడు లోకానికి వచ్చాడు అతిసుందరుడు మనకొరకె పుట్టాడు (2) నీకోసం నాకోసమే పరమును విడిచి భువికొచ్చినాడు (2) పరమును విడిచి భువికొచ్చినాడు ఆనందమే ఆనందమే ఆ నింగిలోన సంతోషమే సంతోషమే ఈ భువిలోన (2) పాపాత్ములమైన మన అందరి కొరకె పరలోక రక్షణను తీసుకొచ్చినాడు అంధకారం తొలగించుతాడు భయమే లేదు మనకెన్నటికి (2) ||నీకోసం||
నశించిపోతున్న ఆత్మాలన్నిటిని వెదకి వచ్చి రక్షించుతాడు (2) నిన్ను నన్ను క్షమియించువాడు హృదయ వాంఛలను తీర్చే మహనీయుడు (2) ||నీకోసం||
అనుదినము మాట్లాడుతాడు నిరంతరం తోడై ఉంటాడు (2) పరమునకు వారధిగా మారి తండ్రి చెంతకు నడిపించుతాడు (2) ||నీకోసం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.