దేహం పాతది - మనసు మలినమైనది
deeham paatadi - manasu malinamainadi
దేహం పాతది - మనసు మలినమైనది జీవం పాపిది - మార్గం తెలియనిది (3) సర్వోన్నతుడా! నిత్య నూతనుడా! నిత్యజీవనం కలిగించుమయ మరియ కన్న తనయ || దేహం||
దాహం తో నువు నీళ్లను అడిగితే ఇవ్వకపోయానే ఆకలిగొని నువు రొట్టెను అడిగితే పెట్టకపోయానే తలదాచుకొనే ఆశ్రయమడిగితే పో అని అన్నానే మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే సర్వోన్నతుడా! నిత్య నూతనుడా! నిత్యజీవనం కలిగించుమయ మరియ కన్న తనయ || దేహం||
తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు తండ్రివి నీవే నాచేయిని నువు పట్టి నడిపించు వీడగ లేని సంసారమనే బంధం విడిపించు నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు సర్వోన్నతుడా! నిత్య నూతనుడా! నిత్యజీవనం కలిగించుమయ మరియ కన్న తనయ || దేహం||
సర్వోన్నతుడా! నిత్య నూతనుడా! నిత్యజీవనం కలిగించుమయ మరియ కన్న తనయ నజరేయ యేసయ్యా!
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
