దేవ కుమారా దీనోపకారా నా

deeva kumaaraa deenoopakaaraa naa

🎵 TG-070💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా ||దేవ కుమారా||

1వ చరణం

వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా ||దేవ కుమారా||

2వ చరణం

పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు ||దేవ కుమారా||

3వ చరణం

వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా ||దేవ కుమారా||

4వ చరణం

భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా ||దేవ కుమారా||

5వ చరణం

కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు ||దేవ కుమారా||

6వ చరణం

మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా ||దేవ కుమారా||

Report Error