దేవ నీవు నన్ను ఁ

deeva neevu nannu m

🎵 TG-327💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవ నీవు నన్ను ఁ బరిశో ధించి బాగుగఁ దెలిసికొంటివి నీ వెఱుఁగు దువు నేను కూర్చుండుటయును నే లేచుటయును ||దేవ నీవు||

1వ చరణం

నాకుఁ దలఁపులు పుట్టినపుడే నా మనస్సు గ్రహించి నాఁడవు ప్రాకటంబుగ నా నడక నా పడకను బరిశీలించితి ||దేవ నీవు||

2వ చరణం

నీకు నా సమస్త చర్యల నిజము తెలియును, మాట నాల్కకు రాకపూర్వము దేవ సర్వముఁ బూర్తిగా నీకే తెలియును ||దేవ నీవు||

3వ చరణం

నా వెనుకను ముందు నుండి నన్ను నావరిఁచి నీ చెయ్యి నీవు నాపయి నుంచితివి నా మది కది కేవల మందదు ||దేవ నీవు||

4వ చరణం

అరుగుదెంచెద నెచ్చటికి నీ యాత్మ యొద్ద నుండి యింక నీ పరమ సన్నిధి నుండి నే నెచ్చోటికిఁ బారిపోవుదు ||దేవ నీవు||

5వ చరణం

ఏను వేకువ టెక్కలను ధరి యించి కడలిలో నున్న నీ చెయి మానక నడిపించు నీ కుడి చేయియు మరి నను గైకొను ||దేవ నీవు||

6వ చరణం

నను సృజించిన తెఱఁగెఱుంగఁగ నాకు భయ మాశ్చర్య మొదవును గనుక నీకును నేఁ గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును ||దేవ నీవు||

7వ చరణం

నేను పిండం బైనయప్పుడు నీవు నను వీ క్షించినాఁడవు నేను బ్రతుకుట ముందె లిఖితంబాయెను నీ గ్రంథంబులో ||దేవ నీవు||

8వ చరణం

నిక్కముగ దేవా నీ తలఁపు లెక్కువ ప్రియ మగును నాకును లెక్కకు నెక్కువౌ ||దేవ నీవు||

Report Error