దేవా మా కుటుంబము

deevaa maa kutunbamu

🎵 TG-2637🌐 Telugu
పల్లవి

దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2) ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ నీ ఆత్మతో నింపుమా (2)           ||దేవా||

1వ చరణం

కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు మాకేమి భయము – మాకేమి దిగులు నీకే వందనములయ్యా లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము లోకాశలు వీడి – లోకంబులోన నీ మందగా ఉందుము ||దేవా||

2వ చరణం

సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్యా ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా మమ్ములను బలపరచుము ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి ఫల సంపదలతోను – కలకాలము జీవించ కురుపించుము నీ దీవెనలన్ పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్ నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో సంతసంబుగ సాగెదము వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము కొంత కాలమే మేము – ఉందుము లోకాన చెంత చేరగ కోరెదము నీ చెంత చేరగ కోరెదము

Report Error