TG-3346
Telugu

దేవా నా అతిక్రమము నీ యెదుట ఎంతో గొప్పది

deevaa naa atikramamu nee yeduta entoo goppadi

Davidsonరాకేష్ కసి · Rakesh Kasiరాకేష్ కసి · Rakesh Kasi
0
views
Chorus

దేవా నా అతిక్రమము నీ యెదుట ఎంతో గొప్పది తండ్రీ నా దోషములు అవి నా తలకు పైగా పొర్లుచున్నవి II2II

పల్లవి పూర్వ భాగం

నేనేమి చేతును… ఎవరు నన్ను రక్షించును… అతిక్రమముల నుండి ఎవరు నన్ను విడిపించును (2) నీవే నీవే నా దేవా… అది నీకు మాత్రమే సాధ్యము దేవా (2)

1వ చరణం

నా దోష భారము నన్ను తరుముచున్నది నా యాత్మ నాలో కృంగిపోవుచున్నది (2) నా జీవితమంతా రోధనతో నిండినది నా ఊపిరి నాకు అసహ్యము గా మారినది (2) ||నేనేమి చేతును||

2వ చరణం

నీలా ఎవరు కరుణించెదరు దేవా… నీలా ఎవరు క్షమియించెదరు (2) నీలా ఎవరు ఆదరింతురు… నీలా ఎవరు అక్కున చేర్చుకుందురు (2) నీవే నీవే నా దేవా… అది నీకు మాత్రమే సాధ్యము దేవా (2) ||దేవా నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.