TG-5045
Telugu

దేవా నా ప్రార్థనా ఆలకించుమయా ఆదుకోవయా నన్ను చేర్చుకోవయా

Deevaa Naa Praarthanaa Aalakinchumayaa Aadukoovayaa Nannu Cheerchukoovayaa

17
views
పల్లవి

దేవా నా ప్రార్థనా ఆలకించుమయా ఆదుకోవయా నన్ను చేర్చుకోవయా (2) విరిగి నలిగిన మనసుతో నీ దరికి నే చేరితి కరుణ కలిగిన యేసుని నామమున నే వేడితి ||దేవా||

1వ చరణం

యవ్వనమే నాదని ఎండమావుల చేరితి. జీవమునే కాదని జిగటఊబిలో కూరితి కనులు తెరచి చూడగా నా చుట్టూ చీకటి ముసిరెనే మోడునై మిగిలాననీ కృంగిపోతిని తోడుకై నిను వేడుచు చేయి చాపితి భ్రమను వీడితి - నీ క్షమను కోరితి (2) ||దేవా||

2వ చరణం

యవ్వనమే నీదని నీ కాడి మోయగ చేరితి జీవమునే కోరితి నీ కరుణ చూపగ వేడితి కనులు తెరచి తేటగా నీ దివ్య ప్రేమను ఎరిగితి యేసులో  చిగురించుటకు నే ఆశ చేసితి జ్యోతిలా వెలగాలని నే బాస చేసితి కృపను కోరితి - నీ శరణు వేడితి ||దేవా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.