TG-1492
Telugu

దేవా నీ గొప్పకార్యములన్

deevaa nee goppakaaryamulan

84
views
పల్లవి

దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసురాజ హల్లెలూయా నా ప్రాణనాథ (2) స్తుతులు మహిమ ఘనత నీకే ||దేవా నీ||

1వ చరణం

శాశ్వత ప్రేమతో నను ప్రేమించి పరమును వీడి భువికరుదెంచి కలువరి సిలువలో రక్తము కార్చి నీదు కృపతో నను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతున్ జీవిత కాలమంతా నీ కంటిపాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచి నీ అరచేతిలో నను చెక్కుకొని నీదు సొత్తుగా నను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.