TG-5049
Telugu

దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుమ

Deevaa Nee Krupa Choppuna Nannu Karuninchuma

22
views
పల్లవి

దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుమ దేవా నీ వాత్సల్యము నాపై చూపించుము మధురమయా నీ ప్రేమా వివరించలేనయా నీ ప్రేమా వర్ణించలేనయా నీ ప్రేమా (2) IIదేవాII నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసితిని నీ దృష్టి ఎదుటే చెడుతనము నే చేసితిని (2) త్రోసి వేయకుము నీ సన్నిధిలోనుండి తీసివేయకుము నీ పరిశుద్ధాత్మను IIమధుర ||నా ప్రాణమా నాలో నీవేల కృంగియున్నావు నా ప్రాణమా నాలో నీవేల నలిగియున్నావు (2) నిరీక్షనుంచుము నా దేవుని యందు స్తుతియించుము నా రక్షణ కర్తను (2) IIమధుర||

1వ చరణం

నా అంతరంగములో స్థిరమైన మనస్సు పుట్టించుము నా యందు దేవా శుద్ధ హృదయం కలుగచేయుము (2) హిమము కంటెను తెల్లగా కడుగుము వినిపించుము ఉత్సాహ సంతోషము (2) IIమధుర||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.