TG-3391
Telugu

దేవా నీ సన్నిధిలో నిరతము నివసింతును

deevaa nee sannidhiloo niratamu nivasintunu

Symonpeter Chevuriసిమాంపేటర్ చేవూరి · Symonpeter Chevuriడీ ప్రీతీ డేవిడ్ · D Preethi David
10
views
Chorus

దేవా నీ సన్నిధిలో నిరతము నివసింతును నీ మార్గములో నను నడుపుము నా జీవితకాలము (2)

పల్లవి పూర్వ భాగం

నీవే నా ప్రాణము నీకే స్తుతి స్తోత్రము నీవే నా గానము నీకే జయ గీతము (2) ||దేవా||

1వ చరణం

హన్నాతో మాట్లాడితివే నీ సన్నిధానములో స్వాస్థ్యమునే బహుమానంగా ఇచ్చి దీవించితివే (2) ప్రార్ధనాలకించి కన్నీరు తుడిచి నిందను తొలగించి వరమిచ్చితివే (2) ||నీవే నా ప్రాణము||

2వ చరణం

రూతుతో మాట్లాడితివే నీ సన్నిధానములో బలపరచి నడిపించి జీవితమే మార్చితివే (2) విధవరాలి పక్షమున వ్యాజ్యమాడినావు విడువక తోడై ఆదరించినావు (2) ||నీవే నా ప్రాణము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.