TG-5046
Telugu

దేవా నిన్ను తలచి నన్ను నేనే మైమరచి

Deevaa Ninnu Thalachi Nannu Neenee Maimarachi

16
views
పల్లవి

దేవా నిన్ను తలచి - నన్ను నేనే మైమరచి పదే పదే నీ ప్రేమను - అదే పనిగా తలపోయుచు దినమంతా నీ ధ్యాసలో - బ్రతుకంతా గడిపేస్తున్నా (2) ||దేవా||

1వ చరణం

తెలిసి తెలిసి నేరములెన్నో - చేసి చేసి నీ గాయము రేపి పాపంబులోనే మరణించిపోక -నీ రుధిరంబుతో (2) నన్ను రక్షించితివే - నా స్థితిని మార్చితివే ||దేవా||

2వ చరణం

తిరిగి తిరిగి లోక వ్యసనాలతో - నశియించిపోయే ఈ పాపిని క్షమియించినీవు తొలగించినావు - నా శిక్షావిధి (2) మితిలేని నీ ప్రేమతో - నీ పాత్రగా మార్చితివే ||దేవా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.