దేవా! వెంబడించితి నీ నామమున్
deevaa! venbadinchithi nee naamamun
దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావె నా భాగ్యమా యేసువా ||దేవా! వెంబడించితి||
యేసూ! నీదు ప్రేమను నే వింటిని భాసురంబగు నీ సిలువ నే గంటిని యేసువాడను నే నంటిని ||దేవా! వెంబడించితి||
ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్ పావనా జూపుము మార్గము ||దేవా! వెంబడించితి||
నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే నావికా రమ్ము నన్ బ్రోవుము ||దేవా! వెంబడించితి||
స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి నీ సత్య సువార్త నే జాటుదున్ ||దేవా! వెంబడించితి||
రాజా! నీదు రాజ్యములో జేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము రక్షణానందము గూర్చుము ||దేవా! వెంబడించితి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.