TG-2207
Telugu

దేవా… యెహోవా… నాకు చాలిన

deevaa… yehoovaa… naaku chaalina

75
views
పల్లవి

దేవా… యెహోవా… నాకు చాలిన వాడా (4) నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడు నీవుంటివి యేసయ్యా ఒక్క మాటతో తుఫాను ఆగెను నీ మాట చాలును యేసయ్యా (2) నా జీవితంలో తుఫానులు ఆపివేయుమా నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా (2) ||దేవా||

1వ చరణం

అడవిలోన మన్నా కురిపించి నీ బిడ్డగ పోషించితివి బండ నుండి నీటిని తెచ్చి దాహమును తీర్చావయ్యా నీ సమృద్ధిలో నుండి దయచేయుమా నీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.