దేవాది దేవాత్మజా మమ్ము దీవించు
deevaadi deevaathmajaa mammu deevinchu
దేవాది దేవాత్మజా మమ్ము దీవించు ప్రభురాజా దేవాదిదైవ మానుషాభవ్య దేదీప్యగుణతేజా ||దేవాది దేవాత్మజా||
చెదరిన నీ గొఱ్ఱెల కదుపు వెదుకవచ్చితివియ్యల సదయా హృదయాభ్యుదయా సాధు జన నిత్య పరిపాలా ||దేవాది దేవాత్మజా||
దురితాలవాలమునం బుట్టు నరకీటముల మన్నా కరుణారసమనిశము మాపై విరఁజల్లవే చల్లగా ||దేవాది దేవాత్మజా||
నరకంబు నిధియొడ్డున మేము దిరుగుచు పడబోయిన తఱి నీ వెఱిఁగి త్వరగా మమ్ము మరలించి నావన్నా ||దేవాది దేవాత్మజా||
యేసు నీ దాసులము నీకు దోసిలి యొగ్గినాము దోషా రోషా భ్యాసములను దూరముఁ దొలఁగించుము ||దేవాది దేవాత్మజా||
ప్రాణేశ నీ సిలువఁ జిందు శోణితంపు విలువ త్రాణకరము స్ధిరము దాని దర్శించుటే జీవము ||దేవాది దేవాత్మజా||
బాలుర మజ్ఞులము మమ్ము బాలింపవే నిత్యము నీ లోపలి జాలి మాకు నిజముగాఁ జూపించుము ||దేవాది దేవాత్మజా||
ఆనందమగు నీ కృప మేము ధ్యానించుటకు నేర్పుమా జ్ఞానోజ్వలము బలము శిశువుల మైన మా కవి యిమ్ము ||దేవాది దేవాత్మజా||