దేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు పాప
deevaputhrulandarru enthoo bhaagyavanthulu paapa
పల్లవి
దేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు పాప మరణాదులు పరిహారమాయెను. ||దేవపుత్రులందఱు ఎంతో||
1వ చరణం
వారు క్రీస్తువల్లనే ఐరి నీతిమంతులు స్ధిరమైన నెమ్మది భక్తులందరొందరి. ||దేవపుత్రులందఱు ఎంతో||
2వ చరణం
తండ్రి యొద్ద పిల్లలు నిర్భయాళులౌదురు వారు కూడ దేవునిన్ చేర భయపడరు. ||దేవపుత్రులందఱు ఎంతో||
3వ చరణం
వారి కెట్టి కష్టముల్ హానిచేయ నేరవు వారికిన్ నిజంబుగా శ్రమ యుపయోగము ||దేవపుత్రులందఱు ఎంతో||
4వ చరణం
ఇహమందు కరుణ చావువేళ నెమ్మదిది పరమందు భాగ్యము వారికిన్ సంపూర్ణము. ||దేవపుత్రులందఱు ఎంతో||