దేవర బ్రోవుమా దీన కుటుంబమున్
deevara broovumaa deena kutunbamun
దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని నడుపుమా ||దేవర బ్రోవుమా||
పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ ||దేవర బ్రోవుమా||
యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున నిలువుమ ||దేవర బ్రోవుమా||
అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ ||దేవర బ్రోవుమా||
పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున గావుమ ||దేవర బ్రోవుమా||
అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను గొలుతుము దేవ ||దేవర బ్రోవుమా||
నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము ||దేవర బ్రోవుమా||
క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ ||దేవర బ్రోవుమా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.