దీవెనల నిడు దేవా నీదు సేవకై వెడలెడు దీనులపైఁ పావనాత్మ నంపుము పనులలో నడిపింపుము కేవలంబుగ మా తనువులు నీ సేవకై యర్పింప గజేయుము ||దీవెనల నిడు||
మాటిమాటికి బాపయుతంబౌ మార్గమునఁ జను మనసులఁ ద్రుంచి మేటి క్రీస్తుని నామా మృతముఁ గ్రోలుచు మేమా పాటున నాత్మల రక్షణకై పనులు సల్ప(గ బంపుము కృపచే ||దీవెనల నిడు||
దివ్య బోధ లెదను గల్గి దీనతను రక్షణ మార్గమును భవ్యముగ బోధింపఁ బరమార్థ మెఱిగింప సేవ్య నేర్పవె దిన దినమును నీ సేవకాళికి నీ మర్మముల ||దీవెనల నిడు||
దురిత రోగాదులచే మిగులఁ తూలి చను మనుజాళికి నీవే పరమ విశ్రాంతి నిడు వరదుఁడ వంచుఁగడు వెరవునను బోధింపంగను నీ వర ములతో నింపుము దాసులను ||దీవెనల నిడు||
గ్రామ సంఘంబులను బడుల క్షేమముగఁ గాపాడి పెంప ఓ మహాత్మ నీ కృప తో మమ్ముఁ గాచి సదా స్వామి మాలో నీవును నీలో మేము మనగను బ్రోవు మామేన్ ||దీవెనల నిడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.