TG-613
Telugu

దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు

deevenathoo selavimmu karthaa maaku

197
views
పల్లవి

దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా దీవించి క్షేమంపు టీవులను దయచేసి జీవ పోషణవార్త భావమున సమకూర్చి ||దీవెనతో సెలవిమ్ము||

1వ చరణం

లోకమున నిన్ను వేఁడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీకరం బగు దివ్య లోకంబులోఁ జేరి యేకముగ స్తోత్రములు నీకుఁ జెల్లింపఁగ ||దీవెనతో సెలవిమ్ము||

2వ చరణం

స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభ మిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ స్తుతియించును సర్వ క్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుఁడని నిన్ను స్తుతియించు ||దీవెనతో సెలవిమ్ము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.