దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని
deevinchaavee samruddhigaa – nee saakshigaa konasaagamani
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా||దీవించావే||
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై వున్నావే (2) ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిను పోలి నన్నిల సాగమని ||దీవించావే||
కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్య కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే ||దీవించావే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
