దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా దీవించుమీ గృహము దేవపుత్రుల మంచి స్థావరంబుగ వెలసి సత్యకాంతుల బరుప ||దీవించు దేవా||
నీవే యీ గృహమునకు నిత్యతలపతివంచు నేవేళ నీ మనసు నెరిగి జీవింపగ ||దీవించు దేవా||
సంభాషణలవేళ సన్నిహితుడా నీకు సంబరంబును గూర్చు సద్వా క్కులను బలుక ||దీవించు దేవా||
భోజన సమయమున భూరి ప్రేమతో నిన్ను పూజ్యుండౌ యతిధిగ పూజసల్పుచు బిలువ ||దీవించు దేవా||
ఇరుగుపొరుగులనెల్ల పరవారివలెగాక పరమాత్మనీసుతుల వలె జూచి ప్రేమింప ||దీవించు దేవా||
అనుదిన ప్రార్థన లందు శ్రద్దాభక్తు లను జూపి క్రైస్తవ యనుభవంబుల నొంద ||దీవించు దేవా||
క్రైస్తవగృహ విధులే గృహమున నెరవేర విస్తారమగు కృపను వీర లందరి కొసగి ||దీవించు దేవా||
ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈ యూర వీరు నీకింపగు సాక్ష్యము నియ్య ||దీవించు దేవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.