దేవుడే జతపరచిన జంట ఇది పరమాత్ముడే పెనవేసిన పవిత్ర బంధమిది
Deevudee Jathaparachina Janta Idi Paramaathmudee Penaveesina Pavithra Bandhamidi
దేవుడే జతపరచిన జంట ఇది పరమాత్ముడే పెనవేసిన పవిత్ర బంధమిది సకల విశ్వాసుల సమక్షములో పరిశుద్ధ దేవుని దివ్య సన్నిధిలో జరుగుతున్న పరిశుద్ధ వివాహమే ఇది క్రీస్తుకిష్టమైన కళ్యాణమే ఇది ఒంటరైన ఇద్దరు ఒకే ఇంటివారై ఇద్దరుగ ఇక ఉండక ఏకతరిరమై ఒకే మాటగా ఒకే బాటగా ఒకరికోసమొకరు బ్రతికెదరు కష్టసుఖాలలో కలిసి సాగెదరు కలకాలం క్రీస్తుతో కలిసుండెదరు అతిథుల రాకతో మొదలాయె సందడి ఆనందంతో వెల్లివిరిసె పెళ్లింటిలొగిలి ఒకరి చేయి ఒకరు విడువక కడదాకా ఒకరి మనసొకరు తెలుసుకుని కలిసుండాలి కలతలు రాకుండా కల్మషం లేకుండా జీవితం సాగాలి హాయిగా క్రీస్తు కేంద్రిత కుటుంబమై ఫలించాలి ఆత్మ దేవుడే అండగా అతిథుల రాకతో మొదలాయె సందడి ఆనందంతో వెల్లివిరిసె పెళ్లింటిలొగిలి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.