TG-5056
Telugu

దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో

Deevudee Maanavunigaa Janminchenu Ee Bhuviloo

0
views
పల్లవి

దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో (2) దేవుడే.. దేవుడే.. పాపాంధకారములో నశియించిన నన్ను జీవ వెలుగు మార్గమున చేర్చెన్ (2) నా సృష్టికర్త - నను ప్రేమించి - అరుదెంచెను - బెతెలేములో (2) నా పాప భారమును సిలువను మోయన్ నా పాప శాపమును సిలువను వేయన్ పరిశుద్ధుడే - నరరూపుడై - అరుదెంచెను - బెతెలేములో (2) శోధన నుండి నను విమోచింపన్ వేదన నుండి నను రక్షింపన్ పరమాత్ముడే - ఇమ్మానుయేలుడై - అరుదెంచెను - బెతెలేములో (2) మహిలో లేని మహిమను నాకు వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు సర్వోన్నతుడే - ప్రసాదింపను - అరుదెంచెను - బెతెలేములో (2)