దేవుని గ్రంధము దినదినము చదువుము
deevuni grandhamu dinadinamu chaduvumu
పల్లవి
దేవుని గ్రంధము దినదినము చదువుము పావనమార్గము జీవము సత్యము ||దేవుని గ్రంధము||
1వ చరణం
ఎంచి తలంచుము మించిన గ్రంథము అంచితముగను రెం డంచుల ఖడ్గము ||దేవుని గ్రంధము||
2వ చరణం
తేనియమధురము తినుము ప్రతిదినము ధ్యానముసేయుము దానన బ్రదుకుము ||దేవుని గ్రంధము||
3వ చరణం
నాధుని వాక్యము అరయుము భాగ్యము పాదపు దీపము భక్తుల కవచము ||దేవుని గ్రంధము||
4వ చరణం
ఆత్మల శాంతము అభయము శ్రేయము ఆత్మలకు బలము అనయము సౌఖ్యము ||దేవుని గ్రంధము||
5వ చరణం
పాపము శాపము పలువిధతాపము పాపును వేగము దాపున జేరుము ||దేవుని గ్రంధము||
6వ చరణం
మదినిది నిరతము పదిలము చేయుము సదమల జ్ఞానము సవిధము మోక్షము ||దేవుని గ్రంధము||