దేవుని యందు - నిరీక్షణ నుంచి
deevuni yandu - nireekssanna nunchi
దేవుని యందు - నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు - నా ప్రాణమా
ఏ పాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడు వాడు ప్రతిక్షణం - నీపక్షముండు రక్షకుడు ||దేవుని||
చీకటిని వెలుగుగ చేసి - ఆయన నీ ముందు పోవువాడు సత్యమగు జీవమగు - మార్గము యేసే ||దేవుని||
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే ఆధారము - ఆధరణ ఆయనలో ||దేవుని||
తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు ||దేవుని||
నీకు విరోధముగా నిరూపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు శత్రువులు మిత్రులుగా మారుదురు ||దేవుని||
పర్వతములు తొలగి పోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు కనికర సంపన్నుడు - నీ దేవుడు ||దేవుని||
స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ||దేవుని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.