TG-3263
Telugu

దేవా నీ సాక్షిగా

Devaa Nee Saakshigaa

0
views
పల్లవి

దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము (2) జాలిగా మనుజాళికై కలువరిలోని ఆ యాగము చాటెద ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు ||దేవా||

1వ చరణం

నాలాంటి నర మాత్రుని చేరుట నీ వంటి పరిశుద్ధునికేలనో (2) ఏ మేధావికి విధితమే కాదిది కేవలం నీ కృపే దీనికాధారము ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంత కొనియాడుట ||దేవా||

2వ చరణం

నా ఊహకందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో (2) నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయు అనుభవమిచ్చావుగా ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించెద ||దేవా||