♪♫
TG-3264
Telugu
దేవా నీ సన్నిధిలో
Devaa Nee Sannidhilo
0
views
పల్లవి
దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము – (2) ||దేవా||
1వ చరణం
అపరాధులగు నీదు ప్రజల నెపములన్నియు బాపి (2) కృపాళుండగు యేసు ప్రభువా కృపను జూపి రక్షించుమయా (2) ||దేవా||
2వ చరణం
చేసి యున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి (2) మోసములలో బడియున్నాము యేసుప్రభు జయమునిమ్ము (2) ||దేవా||
3వ చరణం
లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు (2) నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యముచే (2) ||దేవా||
4వ చరణం
నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రమాణికులన్ (2) శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువ (2) ||దేవా||
5వ చరణం
సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి (2) మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు (2) ||దేవా||