♪♫
TG-3265
Telugu
దేవా నీ తలంపుల
Devaa Nee Thalampulu
0
views
పల్లవి
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ నా యెడల నీ కరుణ సర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా||
1వ చరణం
స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేను హృదయముతో (2) స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2) నీవే నా రక్షకుడవని ||దేవా||
2వ చరణం
మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి (2) వెదుకలేదు ప్రభువా నేను (2) వెదకితివి ఈ పాపిని ||దేవా||
3వ చరణం
అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2) ప్రభును వర్ణింప నశక్యము (2) ప్రభువే సహించె దుఃఖము ||దేవా||
4వ చరణం
ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము (2) కాలమంతా పాడుచుండెద (2) నీ ప్రేమ అపారమైనది ||దేవా||