♪♫
TG-3270
Telugu
దేవాది దేవుడు మహోపకారుడ
Devaadhi Devudu Mahopakaarudu
0
views
పల్లవి
దేవాది దేవుడు మహోపకారుడు మహాత్యము గల మహారాజు (2) ప్రభువుల ప్రభువు – రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును ||దేవాది||
1వ చరణం
సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2) ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది||
2వ చరణం
యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2) నీదు క్రియలు ఘనమైనవి (2) ||దేవాది||
3వ చరణం
అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2) సదా నీకే కలుగును గాక (2) ||దేవాది||