TG-3272
Telugu

దేవర నీ దీవెనల

Devara Nee Deevenalu

12
views
పల్లవి

దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ||

1వ చరణం

ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ||

2వ చరణం

ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ||

3వ చరణం

తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపదలన్నియు బాపుచును ||దేవర నీ||

4వ చరణం

సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ||

5వ చరణం

మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించావే ||దేవర నీ||

6వ చరణం

యిద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ||

7వ చరణం

వాసిగ నీ దాసులము చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడ యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.