దేవుడే నాకాశ్రయంబు
Devude Naakaashrayambu
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును అభయ మభయ మభయ మెప్పు డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||
దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||
రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ||
విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ||
పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును ||అభయ||
కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.