TG-3275
Telugu

దేవుడొక నగరము మన

Devudoka Nagaramu Mana

0
views
పల్లవి

దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండె నుండుటకై (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా (2) ||దేవుడొక||

1వ చరణం

మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను (2) రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

2వ చరణం

నగర ప్రాకారములు ఎత్తైనవి సూర్య కాంతములచే కట్టబడెను (2) ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

3వ చరణం

ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2) పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

4వ చరణం

ఆ నగర వీధులు మేలిమి బంగారం ద్వారములు ఎప్పటికి మూయబడవు (2) ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

5వ చరణం

గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును ఆయనే దీపము నాలయమై యుండును (2) జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

6వ చరణం

జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2) విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||